ఇన్స్టంట్ బ్రేక్ ఫాస్ట్ :  అక్కిరోటీ.. బియ్యం దోశె .. జస్ట్ 10 నిమిషాల్లో రడీ..  

ఇన్స్టంట్ బ్రేక్ ఫాస్ట్ :  అక్కిరోటీ.. బియ్యం దోశె .. జస్ట్ 10 నిమిషాల్లో రడీ..  

 స్పీడు యుగంలో.. తిండి కూడా స్పీడ్​ గా తయారైతే బాగుండు అనుకోవడం సహజం..  అందులోనూ ఉదయాన్నే నిద్రలేచాక టైంతో పాటు పరిగెత్తాలి. అందుకే ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు బియ్యప్పిండితో తయారు చేసుకునే కొన్ని ఇన్​స్టంట్ బ్రేక్​ ఫాస్ట్​ వెరైటీలు మీకోసం..

అక్కిరోటి తయారీకి కావలసినవి

  • బియ్యప్పిండి: కప్పు
  • ఉల్లిగడ్డతరుగు: 1/2 కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము: 3 టేబుల్ స్పూన్లు
  • క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు
  • అల్లం తరుగు - 1 టీస్పూన్
  • పచ్చి మిర్చి తరుగు 1టేబుల్ స్పూన్
  • జీలకర్ర: 1/2 టీస్పూన్ 
  • కారం: 1 టీస్పూన్
  • ఉప్పు, నీళ్లు, నూనె: తగినంత
  • నానబెట్టిన శెనగపప్పు: టేబుల్​ స్పూన్

అక్కిరోటితయారీ విధానం

ఒక గిన్నె తీసుకొని ఉల్లిగడ్డతరుగు, పచ్చికొబ్పరి, క్యారెట్ తురుము, అల్లం, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. అందులో బియ్యప్పిండి వేసి కొంచెం నీళ్లు పోసి చపాతి పిండేలా కలపాలి.

పిండిని తీసుకొని ఉండలు చేసి పక్కన పెట్టాలి. ఒక పాన్ తీసుకొని నూనె రాసి సన్నని మంటమీద ఉంచాలి. దానిపై ఒక పిండి ముద్దను తీసుకొని చేత్తో పాన్ పై చపాతీలా చేత్తో ఒత్తాలి. సన్నని మంటపై రొట్టెను రెండువైపులా నూనె వేసి కాల్చాలి. 


బియ్యప్పిండి దోశె తయారీకి కావలసినవి

  • బియ్యప్పిండి: 1/2 కప్పు 
  • గోధుమ పిండి: 1/2 కప్పు 
  • జీలకర: 1 టీస్పూన్ 
  • కరివేపాకు తరుగు: 1 టేబుల్ స్పూన్  
  • పచ్చిమిర్చి తరుగు: 1టేబుల్ స్పూన్ 
  • నీళ్లు: 1 1/4 కప్పు
  •  ఉల్లి తరుగు : 3 టేబుల్ స్పూన్లు
  • అల్లం తరుగు: 1/2 టీ స్పూన్​
  • పెరుగు: 1 టేబుల్​ స్పూన్​
  • ఉప్పు: తగినంత


బియ్యప్పిండి తయారీ విధానం

ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు, కరివేపాకు, ఉల్లిగడ్డ అల్లం తరుగు, జీలకర్ర వేసి కలపాలి. కొంచెం పెరుగు, సరిపడినన్ని నీళ్లు పోసి కలపాలి... పొయ్యి మీద పెనం పెట్టి ఒక ఉల్లి గడ్డ ముక్కతో పెనంమీద రుద్దాలి.

 పెనం వేడయ్యాక ముందుగా చే సుకున్న పిండిని తీసుకొని అట్టులా వేసి రెండు వైపులా కాల్చాలి. వీటిని టొమాటో చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.